పెద్దవూర మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 89వ వార్షికోత్సవాల సందర్బంగా ఏఐఎస్ఎఫ్ నాగార్జున సాగర్ డివిజన్ సమితి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన బాల, బాలికల కబడ్డీ క్రీడా పోటీలు విజయవంతం అయ్యాయి. ఏఐఎస్ఎఫ్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు రమావత్ శోభన్ బాబు ఆధ్వర్యంలో కబడ్డీ క్రీడలు ముగిసాయి. మండలంలో ఐదు జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్డులు, ఆశ్రమ పాఠశాల, నాలుగు ప్రయివేట్ పాఠశాలల నుంచి 18 బాలుర, బాలికల జట్లు పోటీలో పాల్గొన్నాయి.