దేవరకొండ: రైతు రుణమాఫీపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు
రైతు రుణమాఫీపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. శనివారం కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయ సమీపంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అధ్యక్షతన జరిగింది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు.