నవంబర్ 3న మిర్యాలగూడలో నిర్వహించనున్న బిసి సింహగర్జన మహాసభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు, వేములపల్లి పిఎసిఎస్ మాజీ చైర్మన్ జేరిపోతుల రాములు గౌడ్ కోరారు. శుక్రవారం మాడ్గుల పల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ జనాభాలో 65 శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకు రాజ్యాధికారం దక్కాలని, బీసీ గణనను చేపట్టి సత్వరమే పూర్తిచేసి జనాభా ప్రతిపాదికన బీసీలకు విద్య ఉద్యోగం ఉపాధి రాజకీయ రంగాలలో అవకాశాలు కల్పించాలన్నారు.