రైతులకు అండగా నిలిచేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. సోమవారం డిండి, చెరుకుపల్లిలలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎన్నికల హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేస్తున్నామని, సన్నాలకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నాగార్జున రెడ్డి, వేంకటేశ్వర రావు, ఇతర నేతలు, రైతులు పాల్గొన్నారు.