అచ్చంపేట: పంట నష్ట పరిహారం చెల్లించండి
భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం మంజూరు చేయాలని మాజీ మంత్రి, భాజపా నేత పి. రాములు డిమాండ్ చేశారు. సోమవారం అచ్చంపేటలో సభ్యత్వ నమోదుపై సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా నిధులు జమ చేయకపోవడంతో అధిక వడ్డీకి అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తే భారీ వర్షాలకు నష్టం వాటిల్లిందన్నారు. సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు.