ఏకపక్షంగా ఇందిరమ్మ గ్రామ కమిటీల ఎంపిక సరికాదు'
జహీరాబాద్ మండలంలోని గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేస్తున్న ఇందిరమ్మ కమిటీలను ఏకపక్షంగా నియామకం చేపట్టడం పట్ల బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మూడో కంటికి తెలియకుండా గ్రామ పంచాయతీలలో ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించకుండానే ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు చేయడాన్ని తప్పు పడుతూ.. కమిటీల నియామకంపై ఎంపీడీవో ఏకపక్ష ధోరణి సరికాదని పేర్కొంటూ వినతి పత్రం సమర్పించారు.