పౌర్ణమి పురస్కరించుకొని శ్రీ వీరభద్ర స్వామికి చందన పూజ
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం పౌర్ణమి పురస్కరించుకొని శ్రీ వీరభద్ర స్వామికి చందన పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.