వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉదయం 11 గంటలకు మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు వికలాంగుల హక్కుల పోరాట సమితి కోర్ కమిటీ కో చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ తెలిపారు. అధికారంలోకి వస్తే రూ. 4 వేల పెన్షన్ రూ. 6 వేలకు, వృద్ధులు వితంతువులకు రూ. 4 వేలకు ఆసరా పెన్షన్లు పెంచుతామని ఇచ్చిన ప్రభుత్వం హామీని ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.