నెన్నెల మండలంలోని నార్వాయిపేట గ్రామంలో బుధవారం ఉదయం బెల్లంపల్లి రూరల్ సీఐ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ గంజాయి సేవించి యువత తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో నెన్నెల ఎస్సై ప్రసాద్, తాళ్ల గురిజాల ఎస్సై రమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.