వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో బీసీ కాలనీలో ఓ వివాహిత మహిళ శ్రావణి (28) ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. మృతురాలి తల్లి తెలిపిన వివరాల ప్రకారం. గత 9 నెలల నుంచి కుటుంబంలో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.