వనపర్తి జిల్లాలో సంక్షేమ వసతిగృహాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ..సన్న బియ్యం, తాజా కూర గాయలతో మెనూ సిద్ధం చేయాలన్నారు. ఇతర దినుసుల నాణ్యతను పాటించాలని, స్టోర్ రూమ్ పరిసరాలు పరిశుభ్రత, వంట పాత్రల శుభ్రతలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎక్కడ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరగకుండా చూడాలన్నారు.