నాగర్కర్నూల్: ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులతో పాటు ఫెయిల్ అయిన అన్ని గ్రూపుల సాధారణ విద్యార్థులు, వృత్తివిద్య కోర్సుల విద్యార్థులు ఈ నెల 26వ తేదీ లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని డీఐఈఓ జి. వెంకటరమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించాలని సూచించారు.