కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యురాలికి కాన్పు
ప్రభుత్వ ఆసుపత్రిలోనే సుఖ ప్రసవాలు జరుగుతాయని వనపర్తి డిఎంహెచ్ఓ జయచంద్ర మోహన్ అన్నారు. కమాలద్దిన్ పూర్ పీహెచ్సీ వైద్యాధికారి సౌజన్య తన 2 వ కాన్పును దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట పీహెచ్సీలో చేయించుకున్నది. విషయం తెలుసుకున్న డిఎంహెచ్ఓ ఆమెను అభినందించారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రులలో మౌలిక వసతులు ఉన్నాయని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. పిహెచ్సి డా. ఆసియా, సూపర్వైజర్ ప్రమీల, సిబ్బంది పాల్గొన్నారు.