సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం కురుమూర్తి దర్శనానికి రానున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 10: 00 గంటలకు బయలుదేరి రోడ్డు ద్వారా మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మపూర్ గ్రామంలోని కురుమూర్తి దేవాలయానికి చేరుకుంటారు. మ. 12: 10కు 110 కోట్ల వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్ ఘాట్ రోడ్, పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసి మ. 12. 30 కు కురుమూర్తి స్వామిని దర్శించుకుంటారు. అనంతరం హైదరాబాద్ తిరిగి వెళ్లనున్నారు.