నిరంతరం ప్రజల కోసం తమ కలాన్ని అక్షరాలుగా మార్చుతూ, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ నిజాలను వెలికితీసే జర్నలిస్టుల పై కొందరు దుండగులు, అరాచక శక్తులు దాడులు చేయడం బాధాకరమని, జాతీయ వినియోగదారుల, మానవ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు మందాడి సంజీవరావు అన్నారు. ఇల్లందులో జర్నలిస్టుపై జరిగిన దాడి విషయమై శనివారం ఆయన మణుగూరు పీవీ కాలనీలోని ఆ సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.