షెల్ పికింగ్ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కామ్రేడ్ మల్లెల వెంకట రామ నరసయ్య అన్నారు. మంగళవారం మణుగూరు ఓసిపి మేనేజర్ రాజేశ్వర రావును కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. సదరు కాంట్రాక్టర్ 3 నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని వెంటనే వారికి వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.