హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆరోపించారు. మణుగూరులోని బీఆర్ఎస్ కార్యాలయంలో మహిళా విభాగం ముఖ్యకార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు.