భద్రాచలం నుండి హైదరాబాద్ సిటీలోనే దూర ప్రాంతాలైన మియాపూర్ మరియు కెపిహెచ్బి ప్రాంతాలకు డైరెక్ట్ బస్సులు నడపాలని భద్రాచలం టిజి ఎస్ఆర్టిసి డిపో మేనేజర్ తిరుపతికి ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం బుధవారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు దేపంగి రమణయ్య మాదిగ, అధికార ప్రతినిధి ఇసంపల్లి కృష్ణ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.