ఏజెన్సీలోకి వలస వచ్చిన గౌడ్ కులస్తులకు కులగణన నమోదులో కేటగిరి బీసీ- బి గ్రూపు గానే నమోదు చేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ అన్నారు. ఆదివారం చర్ల మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 1950 జనవరి 26న భారత రాష్ట్రపతి షెడ్యూల్ తెగలను గుర్తించి ఆమోదం తెలిపిన గెజిట్ ప్రకారంగానే ఏజెన్సీలో కులగణన ఆయా కులాల ప్రకారంగా నమోదు ప్రక్రియ జరగాలని పేర్కొన్నారు.