దహేగాం మండలం గిరవెల్లి, చిన్న రాస్పెల్లి గ్రామానికి చెందిన నాయకులు సోమవారం కాగజ్‌నగర్ పట్టణంలోని కాపువాడలో గల ఎమ్మెల్సీ నివాసంలో ఉమ్మడి అదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళారు. ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇట్యాల తాజా మాజీ ఎంపీటీసీ గజ్జల జయలక్ష్మి సురేష్ తదితరులు పాల్గొన్నారు.