పెంచికల్ పేట్ మండలంలోని చేడ్వాయి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు శనివారం సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో ముచ్చటిస్తూ పార్లమెంట్ సభ్యునిగా గొడం నాగేష్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని వారిని కోరారు. దేశం కోసం, ధర్మం కోసం శ్రమిస్తుతున్న నరేంద్ర మోడీ నాయకత్వానికి మద్దతు తెలపాలని కోరారు.