కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ బీఎడ్ కళాశాల ఎదుట శుక్రవారం బీఎడ్ శిక్షణ పొందిన విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ శిక్షణ పూర్తయి ఏడాది గడిచి ఫీజ్ రియంబర్స్మెంట్ అర్హత కలిగిన విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.