రాష్ట్ర ప్రభుత్వం వరి పంటకు రూ. 500 బోనస్ ఇస్తున్న నేపథ్యాన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలని తహసీల్దార్ కేవీ శ్రీనివాసరావు తెలిపారు. వైరా రైతు వేదికలో ఏఓ, సొసైటీ సీఈఓలు, వివిధ శాఖల అధికారులు, ఏఈఓలకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామాల వారీగా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉన్నందున రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు తగిన స్థలాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.