నవంబర్ 5న ఖమ్మంలో జరిగే రాష్ట్ర స్థాయి గిరిజన సమ్మేళనం జయప్రదం కొరకు అందరూ భాగస్వాములు కావాలని ఆహ్వాన సంఘం అధ్యక్షులు, వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ పిలుపునిచ్చారు. శనివారం వైరాలో తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సమ్మేళనం ప్రచార కరపత్రాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామవత్ శ్రీరాంనాయక్, జిల్లా కార్యదర్శి భూక్యా వీరభద్రంతో కలిసి ఆవిష్కరించారు. గిరిజన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.