ఇల్లందు ప్రధాన రహదారిలో గల గాంధీపురం రైల్వే స్టేషన్ ను అక్కడి నుంచి తరలించవద్దని సామాజిక కార్యకర్త వేముల రామ్మూర్తి, ప్రయాణికులతో మంగళవారం మధ్యాహ్నం ప్రాంతంలో వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రధాన రహదారిపై ఎంతో సౌకర్యంగా ఉండే రైల్వే స్టేషన్ ను చర్లపల్లి గ్రామం వద్ద నూతనంగా నిర్మిస్తున్న స్టేషన్ కు మార్చడం వల్ల స్థానికులు, వ్యాపారస్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.