శనివారం కురిసిన వర్షం కారణంగా కారేపల్లి పంచాయతీ పెద్దమ్మ గడ్డ దిండి సీతారాములు ఇల్లు కూలిపోయింది. దీంతో ఆ కుటుంబం నిరాశ్రయులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకులు షేక్ గౌసుద్దీన్ బాధితులకు అండగా ఆదివారం ఐదు వేలు ఆర్థిక సాయం అందించారు. ఆయన మాట్లాడుతూ రాత్రి కురిసిన వర్షానికి కొంతమంది పేదవారి ఇల్లు కూలిపోయని వారిని ప్రభుత్వం ఆదుకోని, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.