సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పత్తి రైతులు దళారీల చేతిలో నలిగిపోతున్నారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్ ఆరోపించారు. బుధవారం ఏన్కూరు పత్తి మార్కెట్ ను సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏన్కూరు మార్కెట్ దళారీల మార్కెట్ గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్కెట్లో సీసీఐ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.