దీపావళి పండుగ దృష్ట్యా నివాస ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో టపాసులు అక్రమంగా నిల్వ లేకుండా చూడాలని, దీపావళి దుకాణాలకు అనుమతులు తీసుకోవాలని లా అండ్ ఆర్డర్ అడిషినల్ డీసీపీ ప్రసాద్ రావు ఆదేశించారు. ఈ మేరకు వేంసూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను శుక్రవారం ఆయన సందర్శించారు. స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, సెక్టార్ అధికారుల విచారణ నివేదికలు, జనరల్ డైరీ రికార్డులు, పరిసరాలను పరిశీలించారు.