సత్తుపల్లిలో మోస్తరు వర్షం

60பார்த்தது
మరో 2 రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. సత్తుపల్లిలో తెల్లవారుజాము నుంచి వాతావరణం మేఘావృతమై వర్షం పడుతోంది. నియోజకవర్గంలో పలుచోట్ల మోస్తరు వర్షం కురవగా, కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా, ఆదివారం ఉదయం నుండి ఇప్పటివరకు అత్యధికంగా సత్తుపల్లిలో 23. 4 మి. మీ వర్షపాతం నమోదైంది.

தொடர்புடைய செய்தி