కూసుమంచి మండలం నాయకన్‌గూడెంకి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన కంచర్ల లక్ష్మారెడ్డి కుమారుడు సంపత్ రెడ్డి గుజరాత్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ థర్డ్ఇయర్ చదువుతున్నాడు. శుక్రవారం కాలేజీకి వెళ్లివస్తున్న క్రమంలో ఓ వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడని తెలిపారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.