ఇందిరా మహిళా డైరీ ఏర్పాటులో భాగంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి పాడి పశువులను సంబంధిత కార్పొరేషన్ల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం ముదిగొండ మండలంలో పర్యటించి ఇందిరమ్మ మహిళా డెయిరీ చిల్లింగ్ యూనిట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. ప్రతి పాల సేకరణ కేంద్రానికి కనీసం 10 మంది పాడి రైతులను ట్యాగ్ చేయాలని పేర్కొన్నారు.