సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ వేగంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశించారు. ఎర్రుపాలెంలోని ఐకేపీ కార్యాలయంలో డేటా ఎంట్రీని మంగళవారం ఆమె పరిశీలించారు. కుటుంబాల నుంచి ఎన్యుమరేటర్లు సేకరించి వివరాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ తప్పులు దొర్లకుండా ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. అనంతరం తహశీల్దార్ ఎం. ఉషాశారదతో మాట్లాడి ఆపరేటర్ల సంఖ్య, రోజువారీ డేటా ఎంట్రీపై ఆరా తీశారు.