ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ప్రారంభమైన కుల గణన డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని మధిర మండలంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డేటా ఎంట్రీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని తెలియజేశారు.