ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక పెవిలియన్ గ్రౌండ్ వద్ద గురువారం బిఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు పువ్వాడ అజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా అభిమానులు కలిశారు. ఈ సందర్భంగా స్థానిక పెవిలియన్ గ్రౌండ్ వద్ద బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నల్ల బార్జీలు ధరించి కొవ్వొత్తుల కాగడాలతో జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలతో జెడ్పి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.