ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం సందర్శించారు. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులెవరు మాయమాటలు చెప్పే దళారులకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు.