ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికులు కీర్తిశేషులు బైరి అమర్ - స్రవంతి దంపతుల పిల్లలకు ఆదివారం ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల్లోపే 6 లక్షల రూపాయలను పిల్లల పేర్లపై ఫిక్స్ డిపాజిట్లుగా చేసి ముగ్గురు పిల్లలకు అందించడం జరిగిందని సిరిసిల్ల బిఆర్ఎస్ నేతలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు.