జిల్లాలో నవంబర్ 24 నాటికి 99శాతం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తయిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సోమవారం సర్వే ఎన్యుమరేటర్లు కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని కలెక్టర్ కుటుంబ సర్వే నిర్వహించారు. సర్వే సిబ్బందికి కలెక్టర్ పూర్తిగా సహకరిస్తూ వివరాలను తెలియజేశారు. పెండింగ్ సర్వే ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, ప్రజల నుంచి సేకరించిన సమాచారం పకడ్బందీగా భద్రపర్చాలని సూచించారు.