ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల పోలీస్ స్టేషన్ ను ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బంది పని తీరు భేష్ అని ఆయన అన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. వివిధ సమస్యతో పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని వారిలో కలిగించాలని, పోలీస్ అధికారులు, సిబ్బంది తరచు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు.