ఇల్లంతకుంట మండలంలో చలి తీవ్రంగా పెరిగింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం గజగజ వణుకుతున్నారు. నిత్యం గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 30-15 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతోంది. ఉదయం 9 గంటల వరకు చలి వీడటం లేదు. చిన్నపిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు బుదవారం హెచ్చరించారు. ఉన్ని దుస్తులు ఉపయోగించాలని సూచిస్తున్నారు.