కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కు శాతవాహన జేఏసీ నేతలు మద్దతు ప్రకటించారు. హుజూరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో గురువారం వారు మాట్లాడారు. కరీంనగర్ అభివృద్ధికి రవీందర్ సింగ్ ఎంతగానో కృషి చేశారని తెలిపారు. ఎన్నికల్లో పెట్టుబడిదారులు, ఆస్తులను కాపాడుకునేందుకు కొంతమంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.