చెన్నైలోని కాందార్‌ నగర్‌ రోడ్డుకి ఎస్పీ బాలు పేరు

54பார்த்தது
చెన్నైలోని కాందార్‌ నగర్‌ రోడ్డుకి ఎస్పీ బాలు పేరు
తమిళనాడులోని ఓ రోడ్డుకి సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెడుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్పీబీ నివాసం ఉన్న చెన్నైలోని నుంగంబాక్కంలో ఉన్న కాందార్‌నగర్‌ మెయిన్‌రోడ్డును 'ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రోడ్డు'గా మార్చారు. ఈ మేరకు తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు 'ఎక్స్‌' వేదికగా పోస్ట్‌ పెట్టారు. సీఎం స్టాలిన్‌ నిర్ణయం పట్ల ఎస్పీబీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.