కులగణన సమగ్ర ఇంటింటి కుటుంబ సభ్యుల సర్వే వివరాలను ఆన్లైన్ లో తప్పులు లేకుండా నమోదు చేయాలని ఎల్లారెడ్డి ఎంపీడీఓ అతినారపు ప్రకాష్ ఎన్యూమరేటర్లకు సూచించారు. గురువారం జడ్పి బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్యూమరేటర్లకు శిక్షణ నిర్వహించారు. మండలంలలో 31 జీపీల పరిధిలో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసిన 41 మంది ఎన్యూమరేటర్లకు ఎంపీడీఓతో పాటు ఎంఈఓ ఎవి. వెంకటేశంలు పలు సూచనలు, సలహాలు అందజేశారు.