ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని 2వ వార్డు బీసీ కాలనీలో అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణపు పనులను త్వరితగతిన పూర్తి చేసి కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ను కాలనీవాసులు కలిసి వినతి పత్రం అందజేశారు. బీసీ కాలనీ దగ్గర సిసి రోడ్డు గత సంవత్సరం మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేశారు. రోడ్డు మధ్యలో మురికి కాలువ ఉండడంతో నిర్మాణానికి వీలు లేకుండా ఉండడంతో కాలనీవాసులకు ఇబ్బందిగా మారింది.