నాగిరెడ్డిపేట్ మండలంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వేగవంతంగా నిర్వహిస్తున్నట్టు స్థానిక ఎంపీడీవో ప్రభాకర్ చారి తెలిపారు. శుక్రవారం మండలంలోని పోచారం, మాల్తుమ్మెద గ్రామలలో నిర్వహించిన కుటుంబాల గుర్తింపు సర్వేను ఎంపీడీవో ప్రభాకర్ చారి పరిశీలించారు. ఇప్పటివరకు మండలంలో సర్వే 57% పూర్తయిందన్నారు. ఇంటింటికి తిరిగి కుటుంబాల గుర్తింపు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్యూమరేటర్లకు సూచించారు.