లింగంపేట్ మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థినికి కళాశాలలో సీటు కోసం జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు భాగయ్య మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును కలిశారు. స్పందించిన ఎమ్యెల్యే నిమ్స్ కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి సీటు వచ్చేలా కృషి చేశారు. విద్యార్థినికి నర్సింగ్ సీటు వచ్చేలా కృషి చేసిన ఎమ్మెల్యేకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.