ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో గురువారం భారత తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవం పురస్కరించుకొని బాలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. చాచా నెహ్రూ చిత్రపటానికి ప్రిన్సిపల్ మహమ్మద్ రఫత్ విద్యార్థులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉపాధ్యాయులు బాలల దినోత్సవం ప్రాముఖ్యతను, జవహర్లాల్ నెహ్రూ జీవిత విశేషాలను వివరించారు.