ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామంలోని చాలా పురాతన విటలేశ్వర ఆలయాన్ని శుక్రవారం కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, మాజీ ఏఎంసీ చైర్మన్ మారెడ్డి వెంకట్ రామ్ రెడ్డిలు దర్శించుకున్నారు. ఆలయ పూజారి శ్రీనివాస్ రావు పంతులు వీరిచే విఠలేశ్వరునికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయం చేస్తామని ప్రకటించారు.