ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల పరిధిలో కులగణన పక్కాగా చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాల మేరకు వార్డు అధికారులకు, మెప్మా సిబ్బందికి కుల గణనపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే పక్కాగా నిర్వహించాలన్నారు.