బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న టి. అశోక్ రావు ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విభాగం నుండి పీహెచ్డీ పట్టాను అందుకున్నారు. "భారతదేశంతో ఆగ్నేయాసియా దేశాల సంబంధాలు, లుక్ ఈస్ట్ పాలసీ ఒక అధ్యయనం" అనే అంశంపై ప్రొఫెసర్ జి. రామ్ రెడ్డి పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తి చేశారు. కళాశాల ప్రిన్సిపల్ కె. అశోక్, సిబ్బంది కలిసి బుధవారం కళాశాలలో సత్కరించారు.