బంజారాహిల్స్: కొనసాగుతున్న ఓపెన్ వర్సిటీ ఉద్యోగుల ఆందోళన
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పదెకరాల స్థలాన్ని జవహర్లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జేఎన్ఎఫ్ఎయూ) కేటాయించవద్దని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్సిటీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసనను కొనసాగించారు. విశ్వవిద్యాలయంలోని సీఎన్టీడీ భవనం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.